![]() |
![]() |

ఇన్ స్టాగ్రామ్ లో క్యూట్ పిక్స్ కంటే హాట్ పిక్స్ కే డిమాండ్ ఎక్కువ. పద్దతిగా చీరలు కట్టుకొని కొందరు సెలెబ్రిటీలు ఫోటోలు అప్లోడ్ చేస్తే వాటికి కనీసం వంద, రెండొందల లైకులు కూడా రావు. కానీ అదే ఓ నిక్కర్, జాకెట్ వస్తే ఎక్కడి లేని లైకులు, కామెంట్లు వచ్చి పడతాయి. నిన్న మొన్నటిదాకా పద్దతిగా ఫోటోలు పెట్టిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ రతికరోజ్.. ఇప్పుడు రూటు మార్చింది. హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ తో వైరల్ గా మారింది.
'పటాస్' షోలోకి వచ్చి స్టాండప్ కమెడియన్‌గా సందడి చేసిన రతిక.. తనదైన కామెడీతో అలరించింది. ఆ తర్వాత కూడా పలు షోలలో కనిపించి మంచి పేరును తెచ్చుకుంది. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది' అనే సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 'మారూ', 'నారప్ప', 'అశోక వనంలో అర్జున కళ్యాణం', 'నేను స్టూడెంట్ సార్', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే కొన్నింట్లో హీరోయిన్‌గానూ మెప్పించింది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన రతిక మొదట్లో అందరికంటే ఎక్కువ తెలివిగల అమ్మాయిలా ఆడింది. ఆ తర్వాత హౌస్ లో రోజులు గడిచేకొద్దీ తన ఆటతీరు, మాటతీరు జనాలకి నీరసం తెప్పించాయి. అటు పల్లవి ప్రశాంత్, ఇటు ప్రిన్స్ యావర్ లతో లవ్ ట్రాక్ నడిపి బిగ్ బాస్ హౌస్ లో 'బేబీ' సినిమాని రిక్రియేట్ చేసింది. బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది రతిక. ముఖ్యంగా తన హాట్ ఫొటోలు, వీడియోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ కుర్రకారును కవ్విస్తుంది. ఫలితంగా రతికరోజ్ నిత్యం ట్రెండింగ్ అవుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోతోంది. తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో వైట్ డ్రెస్ లో అలా నిల్చుంది అంతే.. కామెంట్లతో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
![]() |
![]() |